
తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు (Telangana Teacher Recruitment) సంబంధించిన నోటిఫికేషన్ ను (TS DSC 2023 Notification) విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 5089 ఖాళీలను (Teacher Jobs) భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ.. కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించి రోస్టర్ విడుదల చేయనున్నారు. దీంతో పాటే.. సిలబస్, విద్యార్హత వంటి పూర్తి వివరాలు కూడా రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సెప్టెంబర్ 20 నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు (https://schooledu.telangana.gov.in/ISMS/) వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.
టీఆర్‌టీని ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. 2017 జులైలో నిర్వహించిన టీఆర్‌టీలో దరఖాస్తు రుసుం రూ.200 ఉంది. అప్పుడు రాత పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరపాలని నిర్ణయించిన విద్యాశాఖ పరీక్ష ఫీజును రూ.వెయ్యికి.. అంటే ఏకంగా అయిదు రెట్లు పెంచింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా రాయితీ ఇవ్వలేదు. ఎంసెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.900 మాత్రమే ఫీజుగా ఉంది. ఆ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. వాస్తవానికి టీఆర్‌టీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఎంసెట్ కంటే ఎక్కువే ఉంటున్నా ఫీజు మాత్రం భారీగా నిర్ణయించడంపై నిరుద్యోగులు ఈసారి నియామకాల్లో ముఖ్యాంశాలివీ... ప్రత్యక్ష ఉపాధ్యాయ నియామకాలు, ఎంపిక విధానం, విద్యార్హతలు తదితర అంశాలపై ప్రభుత్వం ఈనెల 5వ తేదీనే జీఓ 25 జారీ చేసింది. ఈసారి సాధారణ ఉపాధ్యాయ పోస్టులకు స్పెషల్ డీఈడీ, స్పెషల్ బీఈడీ పూర్తి చేసి, టెట్ అర్హత సాధించిన వారికి పోటీపడే అవకాశమిచ్చారు. అయితే... ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారు ఆరు నెలలు ప్రత్యేక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్లో స్పెషల్ టీచర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి వివరాలు పేర్కొన లేదు. వీటి దరఖాస్తుల ప్రక్రియకు కాస్త సమయం పట్టనుంది. ఎస్జీటీ కొలువులకు డీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. పరీక్షలో ప్రశ్నలు తెలుగు-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లంలో ఉంటాయి. 160 ప్రశ్నలు... 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు. రోజుకు రెండు విడతల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. తొలుత ఎస్జీటీ అభ్యర్థులకు ఉంటాయి. ఈసారి 1-7 తరగతుల విద్యాభ్యాసం ఆధారంగా స్థానిక, స్థానికేతర అభ్యర్థిగా నిర్ణయిస్తారు. 95% ఖాళీలను స్థానికులతో, 5 శాతాన్ని స్థానికేతరులతో భర్తీ చేస్తారు. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీఆర్‌టీ ఫలితాల అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు. ఎవరైనా అభ్యర్థి ఎస్జీటీగా, ఎస్‌ఏగా ఎంపికైతే... ఎందులో చేరతారో ముందే నిర్ణయించుకొని చెప్పాలి. వారి నుంచి హామీపత్రం తీసుకుంటారు. వదులుకున్న పోస్టులో తర్వాతి అభ్యర్థికి అవకాశమిస్తారు. మార్కులు సమానంగా ఉంటే వయసు ఎక్కువున్న వారికి ర్యాంకులో ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే అమ్మాయికి ప్రాధాన్యం ఇస్తారు. అదీ సమానంగా ఉంటే ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, ఓసీలకు ర్యాంకులు కేటాయిస్తారు. అదీ టై అయితే వారి చదువులో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.
No comments:
Post a Comment