పది, ఇంటర్, డిప్లొమా అర్హతతో భారత రక్షణ రంగంలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వివిధ విభాగాల్లో నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలభర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 22తో ముగుస్తుంది. అంటే మరో వారం రోజులు దరఖాస్తులకు సమయం ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీలు 350
- కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ)-260 పోస్టులు,
- నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-30 పోస్టులు
- యాంత్రిక్(మెకానికల్)-25,
- యాంత్రిక్(ఎలక్ట్రికల్)-20,
- యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)-15
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 22తో ముగుస్తుంది.
జీతం..
నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.21,700గా చెల్లిస్తారు. యాంత్రిక్ పోస్ట్‌లకు రూ.29,200 లభిస్తుంది.
దరఖాస్తు విధానం ఇలా..
- ముందుగా ఐసీజీ అధికారిక పోర్టల్ www.joinindiancoastguard.cdac.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి.. కెరీర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్, నావిక్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లై నౌ’ బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.
- ఈ ప్రక్రియ ముగిసిన తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అర్హత ఉన్న పోస్ట్‌కు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.
విద్యార్హత
నావిక్(జనరల్ డ్యూటీ) పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్ట్‌ల కోసం ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్(రేడియో-పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
ఇండియన్ కోస్ట్‌గార్డ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2002 మే 1 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించాలి.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
16/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
I have a intrest in job
ReplyDelete