
కేంద్రం జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాన డిసెంబర్ లో ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. వాయిదా పడే సూచనలు కినిపిస్తున్నాయి. దీంతో గ్రూప్ 3 పరీక్షను నవంబర్ లో నిర్వహించేందకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇటీవల గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తును వాయిదా కోసం నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే టీఎస్పీఎస్సీ వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటిచింది. దీంతో పాటే.. కొత్త తేదీలను కూడా అనౌన్స్ చేసింది. నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించలేదు. దానిలో డీఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ , గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయి. దీంతో పాటు.. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి కనీసం దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్ కావడంతో దాని ప్రభావం ఈ పరీక్షలపై పడింది. దీనికి తోడు గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ నిర్వహణపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పరీక్షలూ ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు గ్రూప్ 3 పరీక్ష అక్టోబర్ లో నిర్వహించనున్నట్లు ప్రచారం జరగ్గా.. అక్టోబర్ లో తేదీలు ఖాళీగా లేకపోవడంతో వీటిని నిర్వహించడం కష్టంగా మారింది. గతేడాది డిసెంబర్లో 1,363 గ్రూప్–3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 5.36 లక్షల మంది అప్లై చే సుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతున్నా పరీక్ష తేదీని ప్రకటించలేదు. తీరా పరీక్షను అక్టోబర్, నవంబర్ నెలల్లో పెట్టేందుకు ఎర్పాట్లు చేస్తుండగా గ్రూప్–2 పరీక్ష నవంబర్ కు కు రీ షెడ్యూల్ కావడంతో.. గ్రూప్–3 పరీక్ష ఇప్పట్లో కష్టంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముం దని ప్రచారం జరుగుతున్నది. అక్టోబర్లోనే నోటిఫికేషన్ వస్తే నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. దీంతో ఆయా నెలల్లో పరీక్షలు నిర్వ హించడం కష్టమని టీఎస్పీఎస్సీ చెబుతోంది. ఇక గ్రూప్ 3తో పాటు.. డీఏఓ, హాస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే పరీక్షల తేదీలు కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జమిలీ ఎన్నికలు నిర్వహించేందుక కేంద్రం కసరత్తు చేస్తోంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం.. గ్రూప్ 3 పరీక్షను నవంబర్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే నవంబర్ లో గ్రూప్ 2, ఫిజికల్ డైరెక్టర్, డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తేదీలను కూడా ప్రకటించారు. వీటి తర్వాత గ్రూప్ 3 పరీక్ష ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి.
No comments:
Post a Comment