
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనమండలిలో ఇవాళ మంత్రి మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను(Teacher posts) భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ, మెరుగైన విద్యాను రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. అయితే మంత్రి బొత్స ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ఆంధ్రప్రదేశ్ లో 40 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే, మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచర్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారనీ, ఇది సరికాదని విమర్శించారు. మెగా డీఎస్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు,తెలంగాణ ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూస్తుండా ఎట్టకేలకు టీఆర్డీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ చేస్తుందని..పోస్ట్ ల సంఖ్య పెంచాలని,టీఆర్టీ దరఖాస్తు ఫీజుని కూడా తగ్గించాలని,మినీ డీఎస్సీ వద్దు..మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు మహబూబ్ నగర్ లో గురువారం ర్యాలీ చేపట్టారు.
No comments:
Post a Comment