
తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరో భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు లక్కోరా గ్రామం, ANG ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
తెలంగాణ, ఏపీలో ఇటీవల భారీగా జాబ్ మేళాలు (Job Mela) జరుగుతున్నాయి. వేల సంఖ్యలో నిరుద్యోగు యువకులకు ఉద్యోగాలను (Jobs) కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరో భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు లక్కోరా గ్రామం, ANG ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 4 వేల ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.
విభాగాలు:
- ఈ జాబ్ మేళాలో ఐటీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.
అర్హతలు:
- ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మా, బీఫార్మా, పీజీ, డిగ్రీ, ఇంటర్, టెన్త్ అర్మత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- జాబ్ మేళా రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment