
పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. దసరా, దీపావళి సందడి మొదలు కానుంది. ఈ పండుగ సీజన్‌లో 7 లక్షలకు పైగా పార్ట్ టైమ్ జాబ్స్ లభించే అవకాశం ఉంది. భారత్ విభిన్న జాతులు, పండుగలు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అన్ని మతాల ప్రజలు పండుగలను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ సీజన్ కోసం ప్రజలే కాదు, భారతదేశపు ఇ-కామర్స్ దిగ్గజాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్‌లో భారీగా పెరిగే డిమాండ్‌ను తీర్చేందుకు ఇ-కామర్స్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్స్ తేదీలను సైతం ప్రకటించాయి. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఇ-కామర్స్ ఇండస్ట్రీ ఏడు లక్షలకు పైగా గిగ్ ఉద్యోగాలను సృష్టించనుందని నివేదికలు చెబుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ని ప్రకటించింది. సేల్ అక్టోబర్ 8 నుంచి 15 వరకు కొనసాగుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో 1.4 మిలియన్లకు పైగా ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొంటారని కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి, ఫ్లిప్‌కార్ట్ AI-బేస్డ్ కన్వర్జేషనల్ అసిస్టెంట్ ఫ్లిప్పిని తీసుకొచ్చింది. దీన్ని ఇన్ స్టోర్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా రూపొందించారు. అదనంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) సామర్థ్యాలు వినియోగదారులను రియల్ లైఫ్ సెట్టింగ్స్‌లో ప్రొడక్టులను విజువలైజ్ చేసుకొనే వీలు కల్పిస్తాయి. అమెజాన్ స్పెషల్ సేల్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను అక్టోబర్ 8 నుంచి ప్రారంభిస్తోంది. వివిధ కేటగిరీల్లో డిస్కౌంట్లు, డీల్స్‌ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ కంపెనీలు అక్టోబర్ నెలలో భారీ అమ్మకాలను నమోదు చేయనున్నాయి. అమ్మకాల వృద్ధిని పెంచడానికి భారీ డిస్కౌంట్లను కంపెనీలు అందిస్తాయి. భారతీయ ఇ-కామర్స్ రంగంలో మరో ప్రధాన సంస్థ అయిన మింత్ర ఇటీవల తన ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ని ప్రకటించింది. 80 లక్షల కస్టమర్లను ఆకర్షించే అంచనాలతో 6,000 బ్రాండ్‌ల నుంచి ఆకట్టుకునే 23 లక్షల స్టైల్స్ అందించడానికి ఈవెంట్ సెట్ చేసింది. పండుగ సీజన్‌కు సన్నాహకంగా, మింత్ర మహిళల నియామకాన్ని గణనీయంగా పెంచింది. కొత్త ఉద్యోగుల్లో 21% మహిళలు ఉన్నారు. కాంటాక్ట్ సెంటర్ సెగ్మెంట్‌లో 45% మంది మహిళలు ఉంటారు. ఈ వారం ప్రారంభంలో మీషో పండుగ సీజన్‌లో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే ప్రణాళికలను వెల్లడించింది. 2023 ద్వితీయార్థంలో షాపింగ్ కార్యకలాపాల పెరుగుదల దాదాపు ఏడు లక్షల గిగ్ ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని టీమ్‌లీజ్ నివేదిక హైలైట్ చేసింది. ఇది భారతదేశంలో ఉపాధిపై ఇ-కామర్స్ రంగం ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. వృద్ధి చెందుతున్న భారతీయ ఇ-కామర్స్ రంగం గురించి CIEL HR సర్వీసెస్, ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి నుంచి చూసిన కొన్ని అధిక ఆన్‌లైన్ డిస్కౌంట్‌లతో పండుగ సీజన్ కొత్త ఎత్తులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. భారతదేశంలోని టైర్ 2, 3 నగరాల ద్వారా అభివృద్ధి ముందుకెళ్తుందని మిశ్రా అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో నియామకాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 20% పెరుగుతాయని పేర్కొన్నారు. మొత్తం పండుగ సీజన్‌లో ఈ ఇండస్ట్రీలో 7 లక్షలకు పైగా కొత్త గిగ్ జాబ్ ఆఫర్లు కొత్తగా వస్తాయని ఆయన విశ్లేషించారు.
No comments:
Post a Comment