
నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో(Mahatma Gandhi University) పలు పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క సంవత్సర కాలానికి అంటే 2023-24 విద్యాసంవత్సరానికి ఫ్యాకల్టీని నియమించనున్నారు. దరఖాస్తులు, పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ http://www.mguniversity.ac.in/ సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, హిస్టరీ అండ్ టూరిజం, ఈఈఈ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 07
- ఎంఏ సైకాలజీ 02
- ఏంఏ హిస్టరీ అండ్ టూరిజం 01
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 03
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 01
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 04, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్యార్హత
- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సెట్ లేదా నెట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దీనిలో కెరీర్ అనే ఆప్షన్ లో పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది.
- దానిని ఓపెన్ చేసి.. నోటిఫికేషన్ ను క్షణ్ణంగా చదువుకోండి. తర్వాత ఈ పీడీఎఫ్ ఫైల్ లోనే లాస్ట్ లో దరఖాస్తు ఫారమ్ ఉంటుంది. దీనిని డౌన్ లోడ్ చేసుకోండి.
- తర్వాత దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి. దీనిలో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నింపాలి.
- తర్వాత ఆ ఫారమ్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలి. వీటిపై సెల్ప్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది.
- ఈ మొత్తం కాపీలను The Registrar, Mahatma Gandhi University, Yellareddygudem, NALGONDA- 508 254 అడ్రస్ కు పంపించాలి.
- అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 04, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment