హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 65 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనెస్థీషియా, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పాథాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index సందర్శించండి. దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా.. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ .
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment