తెలంగాణలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్), లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మునిసిపల్ స్కూళ్లలో ఖాళీలను డీఎస్సీ (TS DSC 2023)ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 20 నుంచి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TS TRT 2023) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 చివర తేదీ అని నోటిఫికేషన్ లో తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 5089
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులు -1739
- లాంగ్వేజ్ పండిట్ పోస్టులు - 611
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు - 164
- సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు - 2575
ముఖ్యమైన తేదీలు
- సెప్టెంబర్ 20 నుంచి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TS TRT 2023) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 చివర తేదీ
దరఖాస్తు రుసుము
TS DSC 2023 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కోసం వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు వేర్వేరు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. అభర్థులు విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉండే పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అభ్యర్థులు దరఖాస్తులో తమ పరీక్షా కేంద్రాల ప్రాధాన్యత తెలియజేయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల కేటాయింపు ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నాటికి అయా పరీక్షా కేంద్రాల సామర్థ్యం, అక్కడ సీట్ల అందుబాటును బట్టి కేటాయింపు ఉంటుంది. నవంబర్ 20నుంచి 30వ తేదీ మధ్య ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు
వయోపరిమితి
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్ట వయసు 18ఏళ్లు, గరిష్ట వయసు 44ఏళ్లుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యుఎస్ కోటా అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
టీఎస్ టీఆర్టీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ని schooledu.telangana.gov.inను సందర్శించండి
- హోమ్‌పేజీలో TS DSC TRT రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
- TS TRT రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు ఫారం పూర్తిచేయండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ ను సబ్మిట్ చేసి, అనంతరం డౌన్‌లోడ్ చేయండి
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింటవుట్ తీసుకోండి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (updat soon)
- డిఎస్సీ వేకెన్సీ లిస్ట్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
19/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment