
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకణలో భాగంగా 740 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్(Engineering) విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది ఉండేలా సర్కారు చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల కొత్తగా 740 పోస్టులు క్రియేట్ కానున్నాయి. జిల్లాల్లో పనుల పర్యవేక్షణకు నాలుగు చీఫ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేశారు. 12 సూపరింటెండెంట్ ఇంజినీర్, 11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 60 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయాలు, పోస్టులను మంజూరు చేశారు. వీటితో అనేక మంది అధికారులకు పదోన్నతులు రానున్నాయి. ఇంజినీర్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. రూరల్ డెవలప్ మెంట్ , పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో 87 కార్యాలయాలను రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇప్పటికు పదోన్నతులు కల్పించగా.. కొత్తగా 740 పోస్టులను సైతం భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉప్పల్ లో RWS కార్యాలయ ఆవరణలో సూపరిండెంటెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం, విజిలెన్స్ అండ్ క్వాటిటీ కంట్రోల్ విభాగాలను ఆయన అధికారులను కలిసి ప్రారంభించారు. కొత్తగా 4 ఛీప్ ఇంజనీర్, 4 క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఇంజనీరింగ్ కార్యాలయలతో పాటు 12 కొత్త సర్కిళ్లు, 11 డివిజన్లు, ఆరు సబ్ డివిజన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో ఆధునిక హంగులతో ఉప్పల్ లో పంచాయతీ రాజ్ భవన్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతే కాకుండా.. పంచాయతీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రికి ఆర్టిజన్ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖలో మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ జులైలోనే ఆమోదం లభించినది.
మంజూరైన పోస్టుల వివరాలిలా..
- ఛీప్ ఇంజనీర్లు పాతవి- 03.. కొత్తవి 04
- సర్కిల్ కార్యాలయాలు పాతవి - 09.. కొత్తవి - 12
- డివిజన కార్యాలయాలు పాతవి- 36.. కొత్తవి 11
- సబ్ డివిజన్ కార్యాలయాలు పాతవి - 167.. కొత్తవి 60 ఉన్నాయి

No comments:
Post a Comment