ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చండీగఢ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ (CTU) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్ ctu.chdadmnrectt.in సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10 ఏప్రిల్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చండీగఢ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ (CTU) ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 177 పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఇందులో 131 బస్ కండక్టర్ పోస్టులు, 46 హెవీ బస్సు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. కండక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్‌ని నడపడానికి లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.
వయో పరిమితి..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. కండక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వేర్వేరుగా నిర్ణయించబడింది. బస్ కండక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక ఇలా ..
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక పేపర్‌లో రెండు గంటల వ్యవధిలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడిన రెండు భాగాలు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. జనరల్/ఓబీసీ/ఈఎస్‌ఎం/డీఎస్‌ఎమ్ (జనరల్) కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. SC/ Ex-Servicemen/ DSM (ఇతర కేటగిరీలు)/ EWSలకు రుసుము రూ. 500గా నిర్ణయించబడింది. అభ్యర్థులు 15 ఏప్రిల్ 2023 వరకు వరకు నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/UPI ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..
Step 2: దీనిలో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియను అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీ వివరాలను నమోదు చేయాలి.
Step 4: తదుపరి ఫైనల్ సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. దరఖాస్తు సమర్పించినట్లే.
Step 5: చివరగా అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment