Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 28 March 2023

అభ్యర్థులకు అలర్ట్.. కేవీఎస్ ఇంటర్వ్యూ జాబితా విడుదల..

 కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అసిస్టెంట్ కమిషనర్(Assistant Commissioner) పోస్టులకు సంబంధించి ఫైనల్ కీతో పాటు.. ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ (Short List) అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరికి ఏప్రిల్ 10 నుంచి 13 వరకు మరియు ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 20 వరకు వీరికి ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందని నోటీస్ లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 07, 2023న నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52 ఉండగా.. దాదాపు ఒక్క పోస్టుకు 4గురు చొప్పును ఇంటర్వ్యూకు పిలిచారు. ఈ జాబితాలో తమ పేరు ఉన్న అభ్యర్థులు ఢిల్లీలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతీ అభ్యర్థికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కాల్ లెటర్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు.. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్ ను వెబ్ సైట్లో సూచించిన ప్రొఫార్మా ఆధారంగా ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండదని.. అభ్యర్థికి ఏ తేదీ కేటాయిస్తే.. అదే రోజు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. గైర్హాజరైన అభ్యర్థులకు తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఇంటర్వ్యూకు మొత్తం 173 మంది హాజరుకానున్నారు. ఆ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. వీటితో పాటు.. జనవరి 22, 2023న ఉదయం, సాయంత్రం షిప్ట్ లో పరీక్ష రాసిన 2022 ఎల్డీసీఈ రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ కీని వెబ్ సైట్ లో విడుదల చేశారు. దీనిలో ఫైనాన్స్ ఆఫీసర్, హెడ్ మాస్టర్, పీజీటీ, ప్రిన్సిపల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , టీజీటీ, వైస్ ప్రిన్సిపల్ వంటి పోస్టులు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్‌టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్‌టీ(మ్యూజిక్‌)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్‌- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్‌డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials