Mother Tongue

Read it Mother Tongue

Saturday, 25 March 2023

షెహాన్ కరుణతిలకకు బుకర్ ప్రైజ్

  శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలక 2022 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్కు ఎంపికయ్యారు. కరుణతిలక రాసిన 'ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా' పుస్తకానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 1992 తర్వాత ఒక శ్రీలంక జాతీయుడు బుకర్ ప్రైజ్న గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు 1992లో 'ద ఇంగ్లిష్ పేషెంట్' పుస్తకానికి మైఖెల్ ఆండాట్టి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2022 అక్టోబర్ 18న లండన్లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాజు చార్లెస్ సతీమణి కెమిల్లా కరుణతిలకకు ఈ పురస్కారంతోపాటు 50 వేల పౌండ్లను బహూకరించారు. 'ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా' కాల్పనిక థ్రిల్లర్ పుస్తకంలో శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలను, మానవీయ కోణాలను తన కెమెరాలతో బంధిస్తూ యుద్ధంలో మరణించిన ఒక ఫొటో జర్నలిస్ట్ కథను కరుణతిలక అద్భుతంగా ఆవిష్కరించారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials