Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 March 2023

జాతీయ క్రీడా పురస్కారాలు - 2022

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను 2022 నవంబర్ 14న ప్రకటించింది. స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమలక్కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న లభించింది. కొన్నేళ్లుగా 'ఖేల్ రత్న' అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక 'అర్జున' అవార్డు 25 మంది క్రీడాకారులకు దక్కింది. ఇందులో నలుగురు పారాఅథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష, క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు నలుగురు, ద్రోణాచార్య 'లైఫ్ టైమ్' అవార్డుకు ముగ్గురు, ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారానికి నలుగురు ఎంపికయ్యారు.

'ఖేల్ రత్న' అవార్డీలకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్ మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. 'అర్జున' అవార్డీలకు రూ.15 లక్షల ప్రైజ్మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు. ద్రోణాచార్య జీవిత సాఫల్య పురస్కారం విజేతలకు రూ.15 లక్షలు, రెగ్యులర్ ద్రోణాచార్య పురస్కార విజేతలకు రూ.10 లక్షలు, ధ్యానంద్ జీవిత సాఫల్య పురస్కారం విజేతలకు రూ.10 లక్షలు ప్రైజ్ మనీగా లభించాయి.

మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్).

అర్జున అవార్డులు: సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్ (అథ్లెటిక్స్), లక్ష్యసేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్, నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని (లాన్బౌల్స్), సాగర్ కైలాస్ (మల్లఖంబ్), ఇలవెనిల్ వలరివన్, ఓం ప్రకాష్ (షూటింగ్), శ్రీజ (టీటీ), వికాస్ (వెయిట్రిఫ్టింగ్), అన్ను సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషూ), మానసి జోషి, తరుణ్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనిక (డెఫ్ బ్యాడ్మింటన్).

ద్రోణాచార్య: జీవన్ జోత్ సింగ్ (ఆర్చరీ), మహమ్మద్ అలీ (బాక్సింగ్), సుమ సిద్ధార్థ్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్).

ద్రోణాచార్య (జీవితకాల): దినేశ్ జవహార్ (క్రికెట్), బిమల్ ప్రఫుల్లా (ఫుట్బాల్), రాజ్ సింగ్, (రెజ్లింగ్)

ధ్యానంద్ జీవితకాల పురస్కారం: అశ్విని (అథ్లెటిక్స్), ధరమ్ వీర్ (హాకీ), బీసీ సురేశ్ (కబడ్డీ), బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)

No comments:

Post a Comment

Job Alerts and Study Materials