నిరుద్యోగులకు శుభవార్త. సిద్దిపేట జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సిద్దిపేట పరిధిలోని హెల్త్ వెల్ నెస్ సెంటర్లలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విద్యార్హతల వివరాలు: ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బిఎస్సీ (నర్సింగ్)/జీఎన్ఎం విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు: అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా సిద్దిపేటలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా తమ దరఖాస్తులను పంపించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24
దరఖాస్తుల పరిశీలిన: మార్చి 24 నుంచి మార్చి 28
మెరిట్ లిస్ట్ విడుదల: ఏప్రిల్ 3
No comments:
Post a Comment