Mother Tongue

Read it Mother Tongue

Friday, 31 March 2023

నిరుద్యోగులకు అలర్ట్.. 9212 పోలీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు.. ఇలా అప్లై చేసుకోండి

9212 పోలీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు


 కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)  భారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.  ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది. మొత్తం 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలను (CRPF Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు (మహిళలు, పురుషుల మధ్య): 

  • పురుషుల ఖాళీలు 9105 ఉన్నాయి. 
  • మహిళాల  ఖాళీలు 107 ఉన్నాయి.
  • మొత్తం ఖాళీలు 9212 ఉన్నాయి. 

పురుషులకు సంబంధిచిన పోస్టులు

మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులు ఉన్నాయి. 

మహిళాలకు సంబంధించిన పోస్టులు

బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.

విద్యార్హతలు

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

వేతనం

ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు వేతనం ఉంటుంది.

CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)

  1. హిందీ/ఇంగ్లిష్ భాష కు 25 మార్కులు
  2. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు 25 మార్కులు
  3. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ కు 25 మార్కులు
  4. ఎలిమెంటరీ మ్యాథ్స్ కు 25 మార్కులు ఉంటాయి

మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. 

అధికారిక వెబ్ సైట్https://crpf.gov.in/index.htm

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 27
  • దరఖాస్తు కోసం చివరి తేదీ: ఏప్రిల్ 25
  • అడ్మిట్ కార్డ్ జారీ- జూన్ 20-25
  • CRPF కానిస్టేబుల్ పరీక్ష: జులై 1 నుంచి 13

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి 

1 comment:

Job Alerts and Study Materials