Mother Tongue

Read it Mother Tongue

Sunday, 26 March 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో పలు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరులోని ఎన్ఐడీ సంస్థలో డైరెక్ట్, డిప్యూటేషన్, షార్ట్-టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ (teaching), నాన్ టీచింగ్ (Non teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా అప్లై చేసుకోవాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య : 24

పోస్టులు : అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ (ల్యాండ్, బిల్డింగ్ అండ్‌ మెయింటెనెన్స్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు..

పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..

స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మార్చి 25న విడుదల కాగా.. 45 రోజుల్లోగా దరఖాస్తులను ఆఫ్ లైన్ లో పంపించాల్సి ఉంటుంది. చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, నిడ్‌ ఏపీ, ఏఎన్‌యూ, నాగార్జున నగర్‌, నంబూరు, గుంటూరు అడ్రస్‌కు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://www.nid.ac.in/careers-at-nid-ap-ad-hoc వెబ్ సైట్ ను సందర్శించండి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials