Mother Tongue

Read it Mother Tongue

Friday, 24 March 2023

పది అర్హతతో.. RBIలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు దరఖస్తుల చేసుకునే అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాల్లోకి వెళ్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ని సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి పూరించవచ్చు. అంటే ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 25 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. ఈ తేదీ తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తును పంపితే.. వాటిని పరిగణించడం కుదరదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

ఎంపిక ప్రక్రియ..

ఫార్మసిస్ట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హత, ప్రతిభ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనితో పాటు ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు..

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వబడుతుంది.

అర్హతలు..

ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేయబోయే ఏ అభ్యర్థి అయినా తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు.. అభ్యర్థులు ఫార్మసీలో డిప్లొమా కూడా కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం.. 

ముందుగా నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై అవసరమైన అన్ని పత్రాలతో ఫారమ్‌ను నింపి, రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డివిజన్, రిక్రూట్‌మెంట్ డివిజన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ముంబై రీజినల్ ఆఫీస్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై - 400001కి పంపండి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials