మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఖాళీ కోసం నిర్వహించిన పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ని సందర్శించడం ద్వారా ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఫలితాల కోసం విడుదల చేసిన PDF ఫైల్‌లో ఇవ్వబడింది.
మార్కులు ఏప్రిల్ 6న..
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 22 మార్చి 2022న ప్రారంభమైంది. అభ్యర్థులు ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి 30 ఏప్రిల్ 2022 వరకు సమయం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7494 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఎస్సెస్సీ పేర్కొంది. ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను ఫిబ్రవరి 13, 2023న నిర్వహించారు. అధికారిక నోటీసు ప్రకారం.. ఎంపికైన మరియు ఎంపిక కాని అభ్యర్థుల వివరాల మార్కులు ఏప్రిల్ 6, 2023న కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయని తెలిపారు. ఈ అవకాశం 6 నుండి 20 ఏప్రిల్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in కి వెళ్లండి .
-వెబ్‌సైట్ హోమ్ పేజీలోని ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
-దీని తర్వాత మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) ఎగ్జామినేషన్, 2021 లింక్‌పై క్లిక్ చేయండి.
-తదుపరి పేజీలో ఎస్సెస్సీ ఎంటీఎస్ 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీకు PDF ఫార్మాట్ లో ఫైల్ ఓపెన్ అవుతంది. దీనిలో మీ హాల్ టికెట్ నంబర్ తో మీ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
No comments:
Post a Comment