Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 29 March 2023

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ ANCHOR సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ప్రకటన విడుదలైంది. ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

విద్యార్హతల వివరాలు:

ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 25 ఏళ్లలోపు ఉంండాలి. 2020-22 మధ్యలో పాసై ఉండాలి. వార్షిక వేతనం రూ.1.80 లక్షలలోపు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇతర వివరాలు: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సబ్సిడీపై క్యాంటీన్, ట్రాన్స్పొర్టేషన్, సదుపాయాలు ఉంటాయి.

- అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు 9154449677 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials