Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 March 2023

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ), సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 42 హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ), సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 42 హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులు టూరిజం అండ్ హోట్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వీటిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ వద్ద, వీఎస్‌ఎస్‌ నగర్‌, భువనేశ్వర్‌ అడ్రస్ లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏప్రిల్ 03, 04 తేదీల్లో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ దూర భారం అవుతుంది అనుకుంటే..  హైదరాబాద్ లో కూడా ఆ ఇంటర్వ్యూలును నిర్వహించనున్నారు. ఏప్రిల్ 08, 09 తేదీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎఫ్‌-రో, విద్యా నగర్‌, డీడీ కాలనీ, హైదరాబాద్‌ అడ్రస్ లో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు తమ వెంట్ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రయాణ ఖర్చు, టీఏ లాంటివి చెల్లింరని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌ https://irctc.com/new-openings.html. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials