Mother Tongue

Read it Mother Tongue

Friday, 31 March 2023

తెలంగాణ మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

 తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఈ ఖాళీల్లో ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://tsnpdcl.cgg.gov.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హత:

  • ఏదైనా యూనివర్సిటీ నుంచి BA/ B.Sc/ B.Com విద్యార్హత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు
  • మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి Computer Application/ Office Automation (MS-Office) సర్టిఫికేట్ కలిగి ఉండాలి
  • డిగ్రీలోనే కంప్యూటర్ సబ్టెక్ట్ కలిగిన వారికి ప్రత్యేక సర్టిఫికేట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు
  • SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు 5 సంవత్సరాలు
  • Physically Handicapped అభ్యర్థులకు వయస్సు సడలింపు 10 సంవత్సరాలు

ముఖ్యమైన తేదీలు:

ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 10

అప్లికేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 10

ఫీజు చెల్లింపునకు గడువు: ఏప్రిల్ 29 (సాయంత్రం 5 గంటల వరకు)

అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేట్: ఏప్రిల్ 29 (రాత్రి 11.59 వరకు)

దరఖాస్తులు ఎడిట్ చేసుకునే ఛాన్స్: మే 2 నుంచి 5వ తేదీ వరకు

హాల్ టికెట్ల డౌన్ లోడ్: మే 22 నుంచి

పరీక్ష తేదీ: మే 28

మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

9 comments:

Job Alerts and Study Materials