Mother Tongue

Read it Mother Tongue

Friday, 24 March 2023

అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్ సెట్ కీ విడుదలపై కీలక ప్రకటన..

 తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు (Application) ప్రక్రియ శుక్రవారం డిసెంబరు 30 నుంచి ప్రారంభమయ్యాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్(Final Exam) రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అర్హత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటికి ఆన్ లైన్ విధానంలో పరీక్షలను మార్చి 13, 14, 17 తేదీల్లో నిర్వహించారు. అయితే వీటిలో మార్చి 14న నిర్వహించిన సెషన్ 1లో 29 సెంటర్లను ఈ పరీక్ష కొరకు కేటాయించగా.. 8184 అభ్యర్థులకు 6563 మంది హాజరయ్యారు. అలాగే.. సెషన్ 2లో నిర్వహించిన పరీక్షలో 83 శాతం హాజరైనట్లు టీఎస్ సెట్ నిర్వాహకులు తెలిపారు. మార్చి 15న నిర్వహించిన సెషన్ లో కూడా 81 శాతం హాజరు కాగా.. సెషన్ 2లో కూడా 81 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. ఇక మార్చి 17 నిర్వహించిన ఆన్ లైన్ పరీక్షలో సెషన్ 1 లో 77 శాతం.. సెషన్ 2లో కూడా 77 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీదు ఈ సెట్ పరీక్షకు 80 శాతం హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 50,256 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 40,128 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను నిర్వహించిన ఓయూ తాజాగా మరో సమాచారాన్ని తీసుకొచ్చింది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీని రేపు(మార్చి 25) విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మార్చి 25 నుంచి మార్చి 27 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials