వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 9,79,327 లక్షల ఉద్యోగాలు (Government jobs) ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇందులో రైల్వేల్లోనే సుమారు 2.93 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. పార్లమెంట్‌కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఏర్పడడం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలు, సంస్థల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోందాన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే అన్ని శాఖలు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం నిర్వహించే రోజ్‌గార్ మేళాలు కీలకం అవుతుందన్నారు.
ఏఏ శాఖలో ఎనెన్ని ఖాళీలు ఉన్నాయి..
- రక్షణ శాఖలో 2.64 లక్షల ఉద్యోగాలు.
- హోంశాఖలో 1.43 లక్షలు.
- రెవెన్యూలో 80,243 పోస్టులు.
- ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో 25,934 పోస్టులు.
- అటామిక్ ఎనర్జీ శాఖలో 9460 పోస్టులు.
పైనే తెలిపిన శాఖలలో ఖాళీగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ఈ వివరాలను వెల్లడించారు.
No comments:
Post a Comment