
ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ప్రత్యేకావసరాలు గల చిన్నారులకు స్పెషల్ టీచర్లను నియమించి బోధిస్తారు. ఈ పోస్టులకు బీఈడీ (స్పెషల్) పూర్తి చేసిన వారే అర్హులు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు రాష్ట్రంలో తొలిసారి 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టు లను మంజూరు చేస్తూ ఇటీవల ఆర్థికశాఖ జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కొలువు లను పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్(Teacher Recruitment Test) ద్వారా భర్తీ చేస్తామని తాజాగా విద్యాశాఖ మంత్రి (Education Minister) సబితా ఇంద్రారెడ్డి ప్రకటిం చిన విషయం విధితమే. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 796, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 కొలు వులను మంజూరు చేశారు. రాష్ట్రంలో మొత్తం 18,857 మంది ప్రత్యేక అవస రాల పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 కొలువులు మంజూరు చేశారు. దివ్యాంగులు, ఇతర వైకల్యాలతో బాధపడేవారికి రెగ్యులర్ టీచర్లు బోధించే పాఠాలు సరిపోవు. వీరికి సుశిక్షితులైన టీచర్లే బోధించాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. 10 మంది విద్యార్థులుంటే ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా మండలానికి ఒకటి చొప్పున భవిత సెంటర్లను నిర్వహిస్తున్నది. వీటిలో 970 టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ప్రత్యేకావసరాలు గల చిన్నారులకు స్పెషల్ టీచర్లను నియమించి బోధిస్తారు. ఈ పోస్టులకు బీఈడీ (స్పెషల్) పూర్తి చేసిన వారే అర్హులు. డీఎస్సీ కోసం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపగా, తర్వాత 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌నిచ్చింది. మొత్తంగా 6,612 పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్ అయ్యింది. వీటికి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 15న టెట్ ఉండగా.. వీటి ఫలితాలు వెలువడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఒక వేళ ముందే విడుదల చేస్తే.. టెట్ లో అర్హత సాధించిన వారికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.
జిల్లాల వారీగా పోస్టులు ఇలా..
- నల్గొండ 91
- నాగర్ కర్నూల్ 84
- రంగారెడ్డి 78
- సూర్యాపేట 74
- కామారెడ్డి 72
- నిజా మాబాద్ 69
- సంగారెడ్డి 65
- కొత్తగూడెం 56
- ఖమ్మం 56
- యాదాద్రి 55
- హైదరాబాద్ 54
- మెదక్ 53
- సిద్దిపేట 52
- వికారాబాద్ 49
- మహబూబ్న గర్ 43
- నిర్మల్ 40
- జగిత్యాల 39
- ఆదిలాబాద్ 38
- జనగామ 38
- వరం గల్ 37
- మహబూబాబాద్ 36
- వనపర్తి 36
- మంచిర్యాల 34
- గద్వాల 31
- నారాయణపేట 31
- కరీంనగర్ 30
- హనుమకొండ 30
- మేడ్చల్ 30
- పెద్ద పల్లి 27
- ఆసిఫాబాద్ 26
- భూపాలపల్లి 25
- ములుగు 24
- సిరిసిల్ల 20
No comments:
Post a Comment