
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 30,041 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో నియమించనున్నారు. ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఆగస్టు 24 నుండి ఆగస్టు 26 వరకు తమ దరఖాస్తుల్లో తప్పులను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ఏదైనా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వీటికి ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,058 పోస్టులు ఉండగా, తెలంగాణలో 961 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఏపీ నుంచి 1053 మంది, తెలంగాణ నుంచి 960మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టిన ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 16లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థుల తమ ఫలితాలను https://indiapostgdsonline.gov.in/ సందర్శించండి. అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అయితే 2011 కంటే ముందు 10వ తరగతి చదువుకున్న అభ్యర్థులకు ఇప్పటి అభ్యర్థులతో పోల్చితే.. మార్కుల్లో , గ్రేడ్స్ లో చాలా తేడాలు కనపడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం పదో తరగతి చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు పరీక్ష నిర్వహించి.. దానిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు కేటాయించాలని పోస్టల్ డిపార్ట్ మెంట్ ను కోరుతున్నారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment