
10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో జేఎల్ పరీక్షలు ఆలస్యం అయ్యాయి. ఎట్టకేలకు ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబర్ 03 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటాయి. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించనుందో ఆ షెడ్యూల్ కూడా ప్రకటించింది. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. నేడు (సెప్టెంబర్ 05) వెబ్ సైట్ నుంచి ఈ పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా అధికారక వెబ్ సైట్ ను సందర్శించండి. అక్కడ డౌన్ లోడ్ జేఎల్ హాల్ టికెట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ టీఎస్పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది. పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. అయితే పేపర్ 2ని కూడా తెలుగు మీడియంలో నిర్వహించాలని తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు కోరుతున్నారు.
ముఖ్యమైన లింక్స్
- హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment