ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (AP Government Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 88 పీహెచ్‌సీలు ఏర్పడనున్నాయి. వాటిలో మొత్తం 1,232 పోస్టులను వైద్యారోగ్య శాఖ మంజూరు చేసింది. ఇంకా ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 63 పీహెచ్‌సీల్లో 378 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ వివరాలను ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. మంజూరైన పోస్టుల్లో డాక్టర్, హెల్త్ సూపర్‌వైజర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
No comments:
Post a Comment