మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి. భారత కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) పలు పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి నోటిఫికేసషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీఎస్ సీ అర్హత కాగా, ఫైర్మెన్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించారు. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ 1, ఫైర్మెన్ 25 ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు పది, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 25 ఏళ్లకు మించకుండా ఉండాలిన తెలిపారు. అలాగే.. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని ఆఫ్లైన్ విధానంలో పంపించాలి. దరఖాస్తులు పంపించాల్సిన చిరునమా జనరల్ మేనేజర్, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ అంతస్తు, బీఎమ్టీసీ కాంప్లెక్స్, శాంతినగర్, బెంగళూరు 560027.
వేతనం.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్లకు రూ.60,000, ఫైర్మెన్ పోస్టులకు రూ.25,000 చెల్లిస్తారు.
👍
ReplyDeleteOk
DeletePUBLISH
DeleteTrue
ReplyDeleteWas
ReplyDeleteFairman officers and Deputy director manager ok
ReplyDelete