Mother Tongue

Read it Mother Tongue

Saturday, 11 March 2023

గుడ్ న్యూస్.. 40,889 జీడీఎస్ పోస్టుల ఫలితాలు విడుదల..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ 40,889 జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ 40,889 జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 23 పోస్టల్ సర్కిళ్లల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతిలో గణితం, ఆంగ్లం తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించి ఉండటం కూడా అవసరం. తాజాగా ఈ పోస్టులకు సంబధించి ఫలితాలను పోస్టల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. తెలంగాణలో సర్కిల్ లో 1261, ఏపీ సర్కిల్ లో 2477 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు మార్చి 23, 2023 తేదీన జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థుల వెంట ఓరిజినల్ సర్టిఫికేట్లతో పాటు.. రెండు జతల విద్యార్హత సర్టిఫికేట్లను జిరాక్స్ తీసుకురావాలని వెబ్ నోట్లో పేర్కొన్నారు. అయితే పదిలో వచ్చిన మెరిట్ స్కోర్ అధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. చాలా మందికి పది లో 100 మార్కులు, 95 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత తర్వాత జాయినింగ్ లెటర్ ను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తులు 16 ఫిబ్రవరి 2023 వరకు స్వీకరించారు. ఈ అప్లికేషన్‌ల ఎండిట్ ఆప్షన్ ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19, 2023 వరకు కల్పించారు. ఫలితాల కొరకు https://indiapostgdsonline.cept.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించండి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials