Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 March 2023

ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పాసైనవారికి ఉద్యోగాలు... రూ.46,000 వరకు జీతం

 ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఇతర పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నేషనల్ ఆటోమోటీవ్ టెస్ట్ ట్రాక్స్ కోసం ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్యను ప్రకటించలేదు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 మార్చి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. 

భర్తీ చేసే పోస్టులు

 టెక్నీషియన్ ల్యాబ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్

టెక్నికల్ అసిస్టెంట్- వెహికిల్ టెస్టింగ్

టెక్నికల్ అసిస్టెంట్- హోమోలోగేషన్ టెస్టింగ్

 ఇంజనీర్- గ్రౌండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్

జూనియర్ ఆఫీసర్- హ్యూమన్ రీసోర్సెస్

విద్యార్హతలు

టెక్నీషియన్ ల్యాబ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్: ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్- వెహికిల్ టెస్టింగ్: డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఆటో ఇంజనీరింగ్ పాస్ కావాలి. 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్- హోమోలోగేషన్ టెస్టింగ్: డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఇంజనీర్- గ్రౌండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్: ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. వయస్సు 34 ఏళ్ల లోపు ఉండాలి.

జూనియర్ ఆఫీసర్- హ్యూమన్ రీసోర్సెస్: హ్యూమన్ రీసోర్స్‌లో ఎంబీఏ పాస్ కావాలి. వయస్సు 32 ఏళ్ల లోపు ఉండాలి.

వేతనం

టెక్నీషియన్ ల్యాబ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్: రూ.22,000

టెక్నికల్ అసిస్టెంట్- వెహికిల్ టెస్టింగ్: రూ.30,000

టెక్నికల్ అసిస్టెంట్- హోమోలోగేషన్ టెస్టింగ్: రూ.30,000

ఇంజనీర్- గ్రౌండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్: రూ.42,000 నుంచి రూ.46,000

జూనియర్ ఆఫీసర్- హ్యూమన్ రీసోర్సెస్: రూ.42,000 నుంచి రూ.46,000

ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.becil.com/ వెబ్‌సైట్‌లో vacancies సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 2- Advt No. 284 లింక్ పైన క్లిక్ చేస్తే జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.

Step 3- నోటిఫికేషన్ చివర్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.

Step 4- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Step 5- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 6- నోటిఫికేషన్‌లో వెల్లడించిన hr.bengaluru@becil.com చివరి తేదీలోగా పంపాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials