Mother Tongue

Read it Mother Tongue

Friday, 17 March 2023

కేంద్రంలో 84,866 ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలు ఇలా..

 సాయుధ బలగాల్లో ప్రస్తుతం 2,193 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. 2023 జనవరి 1 డేటా ప్రకారం.. సీఆర్‌పీఎఫ్‌లో 750 మంది వైద్యులు అందుబాటులో ఉండగా, ఈ ర్యాంక్‌లో మరో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్లమెంట్‌లో బడ్జెట్-2023 సెషన్-2 సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్య, ఉద్యోగాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) సమాధానాలు ఇచ్చింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సాయుధ బలగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని సభ్యులు అడగడంతో.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ సహా ఆరు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో మొత్తం 84,866 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలోని వివిధ సాయుధ బలగాల్లో ఈ ఏడాది జనవరి 1 నాటికి ఉన్న ఖాళీల వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్‌లో 29,283 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్‌లో 19,987, సీఐఎస్‌ఎఫ్‌లో 19,475, ఎస్‌ఎస్‌బీలో 8,273, ఐటీబీపీలో 4,142, అస్సాం రైఫిల్స్‌లో 3,706 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.     సాయుధ బలగాల్లో ప్రస్తుతం 2,193 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. 2023 జనవరి 1 డేటా ప్రకారం.. సీఆర్‌పీఎఫ్‌లో 750 మంది వైద్యులు అందుబాటులో ఉండగా, ఈ ర్యాంక్‌లో మరో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఎస్‌ఎఫ్‌లో 545 మంది వైద్యులు ప్రస్తుతం సేవలందిస్తుండగా, మరో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌ఎస్‌బీ‌లో 217 మంది, అస్పాం రైఫిల్స్‌లో 174 మంది వైద్యులు ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఈ రెండు ఫోర్స్‌ల్లో వరుసగా 45, 5 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2023 జనవరి 1 డేటా ప్రకారం.. సీఆర్‌పీఎఫ్‌లో 2,900 మంది నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బీ‌ఎస్‌ఎఫ్‌లో 1,791, సీఐఎస్‌ఎఫ్ 241, ఐటీబీపీ 1531, ఎస్‌ఎస్‌బీ 515, అస్సాం రైఫిల్స్‌లో 1,420 మంది నర్సులు సేవలిందిస్తున్నారు. వివిధ సాయుధ బలగాల్లో భర్తీ కావాల్సిన నర్సుల పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో 1,330, బీఎస్‌ఎఫ్‌లో 317, సీఐఎస్‌ఎఫ్‌లో 81, ఐటీబీపీలో 169, ఐటీబీపీలో 228, అస్సాం రైఫిల్స్‌లో 229 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ‘కేంద్ర సాయుధ బలగాల్లో ఇటీవల కొత్తగా నియామకాలు జరిగాయి. గత ఐదునెలల్లో దాదాపు 31,785 మందిని రిక్రూట్ చేశారు. కేంద్ర సాయుధ బలగాల్లో పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్ల స్థాపన, కొత్త పొజిషన్స్ ఏర్పాటు తదితర కారణాల వల్ల ఖాళీలు ఏర్పడుతున్నాయి. 2023 జనవరి 1 నాటికి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో డాక్టర్లకు సంబంధించిన ఖాళీలు 247, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి సంబంధించిన ఖాళీలు 2,354 ఉన్నాయి.’ అని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో వెల్లడించారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials