నిరుద్యోగులకు ప్రముఖ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Bank Jobs Notification) విడుదల చేసింది. మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సెంట్రల్ బ్యాంక్. మొత్తం 147 ఖాళీలు (Jobs) ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజుల గడువు ఇచ్చింది బ్యాంక్. దరఖాస్తుకు ఆఖరి తేదీగా మార్చి 15ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
CM - IT (Technical) 13
SM - IT (Technical) 36
Man - IT (Technical) 75
AM - IT (Technical) 12
CM (Functional) 05
SM (Functional) 06
మొత్తం: | 147 |
విద్యార్హతల వివరాలు:
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించింది బ్యాంక్. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWBD, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
ఇలా అప్లై చేసుకోండి:
Step 1: అభ్యర్థులు ముందుగా https://www.centralbankofindia.co.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం నోటిఫికేషన్ కింద Click here for apply ఆప్షన్ పై క్లిక్ చేయండి
Step 4: ముందుగా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి
Step 5: అనంతరం అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.
No comments:
Post a Comment