స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించి తమ ఫలితాలను చూసుకోవచ్చు. SSC CHSL-2021 టైర్ 2 ఫలితాలను డిసెంబర్ 16, 2022న ప్రకటించబడింది. టైపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు మొత్తం 35,023 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయగా.. CAGలో DEO పోస్టుకు 4374 మంది అభ్యర్థులు మరియు 1511 మంది అభ్యర్థులు DESTకి హాజరు కావడానికి షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. మొత్తం 14873 మంది అభ్యర్థులు టైపింగ్ టెస్ట్ (లిస్ట్-I), 220 మంది అభ్యర్థులు DEST (CAG) (లిస్ట్-II) మరియు 1067 మంది అభ్యర్థులు DEST (CAG కాకుండా) (లిస్ట్-III) సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారు.
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in కి వెళ్లండి
-హోమ్‌పేజీలో ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-CHSL స్కిల్ టెస్ట్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్‌పై PDF ప్రదర్శించబడుతుంది.
-ఇక్కడ మీ ఫలితాన్ని చూసుకోండి. తర్వాత భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.
ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. 2018 సంవత్సరంలో 5649 పోస్టుల్ని, 2019 సంవత్సరంలో 4755 పోస్టుల్ని, 2020 సంవత్సరంలో 4726 పోస్టుల్ని భర్తీ చేసింది. 2021 నోటిఫికేషన్ ద్వారా 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL 2021 నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు 2022 ఫిబ్రవరి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 7 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
2023 CHSL పరీక్షకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ తేదీలను SSC ప్రకటించింది. మే 9 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ట్విట్టర్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని సూచించింది. 2022 CHSL పరీక్షకు చెందిన అప్లికేషన్ తేదీలు జనవరి 4తో ముగిశాయి. జనవరి 10వరకు అప్లికేషన్‌లో తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువు కూడా ముగియడంతో 2023 పరీక్షకు సంబంధించిన దరఖాస్తు తేదీలను ప్రకటించింది.
No comments:
Post a Comment