నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. వీటికి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. దీనికి అధికారిక వెబ్‌సైట్ చిరునామా ncbindia.comను సందర్శించొచ్చు. నిన్నటి నుంచే(మార్చి 04) ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ మార్చి 24, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఖాళీ వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తారు.
డిప్యూటీ మేనేజర్ - 10 పోస్టులు
మేనేజర్ - 3 పోస్టులు
గ్రూప్ మేనేజర్ - 3 పోస్టులు
జనరల్ మేనేజర్ - 4 పోస్టులు
ఆఫీస్ అసిస్టెంట్ - 1 పోస్ట్
విద్యార్హత..
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. సివిల్, కెమికల్, మెటీరియల్ సైన్స్ స్ట్రీమ్ వారికి అవకాశం ఉంటుది. ఎలాంటి పని అనుభవం అవసరం లేదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇక మేనేజర్ పోస్టుల విషయానికి వస్తే..
కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. సంబంధిత పనిలో 5 ఏళ్ల అనుభవం అవసరం.
గ్రూప్ మేనేజర్ పోస్టులకు సంబంధిత స్ట్రీమ్ లో బీటెక్ డిగ్రీ ఉండాలి. వీటితో పాటు.. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాల పని అనుభవంతో పాటు.. బీటెక్ మెకానికల్, కెమికల్ గ్రూప్ లో డిగ్రీ ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 ఏళ్ల అనుభవంతో పాటు.. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. వీటితో పాటు.. ఇంగ్లీష్ లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సైన్స్ / కామర్స్ / మేనేజ్ మెంట్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Hlo
ReplyDelete8688939013
ReplyDelete