Mother Tongue

Read it Mother Tongue

Thursday, 9 March 2023

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

 తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను https://chfw.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడొచ్చు. ఇంకా ఈ లింక్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అయితే కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

మొత్తం 11 రేడియోగ్రాఫర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/బీఎస్సీ (రేడియోగ్రఫి)/DMIT (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు

వేతనం:

ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

ఎలా అప్లై చేయాలంటే:

- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://chfw.telangana.gov.in/home.do) ను ఓపెన్ చేయాలి.

- హోం పేజీలో కనిపించే Recruitment to the post of Radiographer కింద కనిపించే అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి.

- అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

- ఆ ఫామ్ లో మీ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్మిట్ చేయాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials