పోస్టాఫీస్ ఉద్యోగలంటే యూత్ లో ఆ క్రేజే వేరుగా ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం
లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పోస్టల్ శాఖ
సైతం ఎప్పటికప్పుడు వివిధ సర్కిల్స్ లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను
(Job Notification) విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా నిరుద్యోగులకు పోస్టల్
శాఖ (Postal Jobs) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 58 ఉద్యోగాలను భర్తీ
చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అయితే.. ఈ ఉద్యోగాలను
తమిళనాడు సర్కిల్ లో భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల
భర్తీకి ఈ ప్రకటన విడుదల చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించగా..
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సూచించిన
చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి టెన్త్ పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
- ఇంకా లైట్ లేదా హెవీ మోటార్ వెహికిల్స్ కు సంబంధించిన వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొంది ఉండాలి.
- మోటార్ మెకానిసమ్ పై అవగాహన ఉండాలి.
- మూడేళ్ల పాటు హెవీ, లైట్ వాహనాలను నడిపిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
Step 1: అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
Step 2:
ఇందుకోసం దరఖాస్తులను పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్ సైట్
https://www.indiapost.gov.in/లేదా పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ నుంచి డౌన్
లోడ్ చేసుకోవాలి.
Step 3: అందులో సూచించిన విధంగా దరఖాస్తులో వివరాలను
నింపాలి. నింపిన దరఖాస్తును Senior Manager (JAG), Mail Motor Service,
No.37, Greams Road, Chennai 600006 చిరునామాకు పంపించాలి.
Step 4: దరఖాస్తులు మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరాలా తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment