Mother Tongue

Read it Mother Tongue

Thursday, 23 March 2023

53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు

53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు 2022 నవంబర్ 20-28 వరకు గోవాలో జరిగాయి.

అవార్డు విజేతలు

  • వాలెంటినా మౌరెల్ దర్శకత్వం వహించిన స్పానిష్ చిత్రం 'ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్' ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మక 'గోల్డెన్ పీకాక్' అవార్డును గెలుచుకుంది.
  • 'నో ఎండ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వాహిద్ మొబాస్సేరికి సిల్వర్ పీకాక్ అవార్డు (ఉత్తమ నటుడు) దక్కింది.
  • 'ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్'లో నటించిన దానియేలా మారిన్ నవరో ఉత్తమ నటిగా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకుంది.
  • ఇరాన్ రచయిత, దర్శకుడు నాదెర్ సైవర్ నో ఎండ్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది.
  • ఫిలిప్పినో చిత్రనిర్మాత లవ్ డియాజ్ 'వెన్ ది వేవ్స్ ఆర్ గాన్' చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకున్నారు.
  • 'బిహైండ్ ది హేస్టాక్' చిత్రానికి గాను అసిమినా ప్రొడ్రూ ఉత్తమ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.
  • ప్రవీణ్ కాండ్రేగుల 'సినిమా బండి' చిత్రానికి గాను స్పెషల్ అవార్డు అందుకున్నారు.
  • ప్రముఖ స్పానిష్ చిత్ర దర్శకుడు కార్లోస్ సౌరాను ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.
  • చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 పురస్కారం
  • ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
  • గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేశారు.
  • గతంలో ఈ అవార్డుని అందుకున్న వారిలో అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్, ఇళయరాజా తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials