Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 7 March 2023

విద్యాసంస్థలో.. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ (IIT Delhi) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://home.iitd.ac.in/jobs-iitd/index.phpని సందర్శించడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందడంతో పాటు.. దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 20, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ మరియు ఇంజనీర్ ఉన్నాయి.

పోస్టుల సంఖ్య: 89

వయోపరిమితి..

 -అసిస్టెంట్ రిజిస్ట్రార్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్టులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.

-అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ జూనియర్ అకౌంట్స్ & ఆడిట్ ఆఫీసర్/ జూనియర్ ఇంజనీర్ సివిల్/ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్/ అప్లికేషన్ అనలిస్ట్ పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు.

-అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ అకౌంట్స్ & ఆడిట్ అసిస్టెంట్: గరిష్టంగా 30 సంవత్సరాలు.

సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులకు గరిష్టంగా 55 సంవత్సరాలు.

-సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులకు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు..

జనరల్ / ఇతర వెనుకబడిన తరగతి (OBC) / ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) అభ్యర్థులు గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే.. రూ. 500 చెల్లించాలి.

గ్రూప్ బీ, సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.

షెడ్యూల్డ్ కులాలు (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST) / వికలాంగులు (PWD) / మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials