తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఖాళీ పోస్టులకు నియామకం చేపట్టనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో చీఫ్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్ పోస్టులున్నాయి.
ఖాళీల పోస్టులు ఇలా ఉన్నాయి..చీఫ్ ఫైర్ ఆఫీసర్ లో.. టెక్నికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ వంటి వాటిలో 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.స్టేషన్ ఆఫీసర్ 07, బీ సబ్-ఆఫీసర్/ బి 28 పోస్టులున్నాయి. డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ 83 పోస్టులున్నాయి. పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటకే ప్రారంభం కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.nfc.gov.in/ సందర్శించవచ్చు. నోటిఫికేషన్ పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరో నోటిఫికేషన్లో.. హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (Hyderabad-DMHO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (TS Job Notification) విడుదల చేసింది. సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను నింపి.. ప్రింట్ తీసుకోవాలని. ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకుని O/o. District Medical & Health Officer, Hyderabad # 4th floor, GHMC Building, Patny, Secunderabad చిరునామాలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది
No comments:
Post a Comment