Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 7 March 2023

వివిధ ఉద్యోగాల భర్తీకి ఐఐటీ బాంబే నోటిఫికేషన్.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

 దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ బాంబే(IIT-Bombay) ఒకటి. మెరిట్ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థలో ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం రోలింగ్ అప్లికేషన్స్ విధానంలో ఈ సంస్థ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. ముందస్తుగా అప్లై చేసుకున్న వారికి ఈ విధానం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలను పరిశీలిద్దాం.

నాలుగు విభాగాల్లో ఖాళీల భర్తీ

 ఐఐటీ బాంబేలో అశాంక్ దేశాయ్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, సెంటర్ ఆఫ్ స్టడీస్ ఇన్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ ఫర్ రూరల్ ఏరియాస్, సెంటర్ ఫర్ అర్బన్ సైన్స్ & ఇంజినీరింగ్, కోయిటా సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్, సెంటర్ ఫర్ మెషిన్, ఇంటెలిజెన్స్ అండ్ డేటా వంటి వివిధ అకడమిక్ సెంటర్స్‌ ఉన్నాయి. వీటిల్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది.

అప్లికేషన్ ప్రాసెస్

అర్హత ఉన్న అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ పోర్టల్‌ iitb.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత, తమ రెజ్యూమ్స్, రీసెర్చ్ అండ్ టీచింగ్ స్టేట్ మెంట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేసి ఈ మూడు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కావచ్చు. 

అర్హత ప్రమాణాలు

ఈ మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్‌డీ ఫస్ట్ క్లాస్‌లో పాసై ఉండాలి. లేదా పీజీలోనూ సమానమైన గ్రేడ్ పొంది ఉండాలి. అలాగే ప్రఖ్యాత జర్నల్స్‌లో పబ్లికేషన్స్‌తో సహా అద్భుతమైన ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉండడం తప్పనిసరి. ఒక్కో పోస్ట్ ప్రత్యేక అర్హతలు ఇలా ఉన్నాయి. 

ప్రొఫెసర్

ఈ పోస్ట్ కోసం కనీసం పదేళ్ల పోస్ట్- పీహెచ్‌డీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అందులో నాలుగేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్ లెవల్ లేదా ఏదైనా సంస్థ లేదా ప్రఖ్యాత పరిశ్రమలో సమానమైన స్థాయిలో పనిచేసి ఉండాలి.

అసోసియేట్ ప్రొఫెసర్

ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఆరేళ్ల పోస్ట్ పీహెచ్‌డీ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఇందులో మూడేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I లెవల్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా పరిశ్రమలో సమానమైన స్థాయిలో పనిచేసి ఉండాలి. 

అసిస్టెంట్ ప్రొఫెసర్

ఇందులో గ్రేడ్ -I పోస్ట్ కోసం పీహెచ్‌డీ తర్వాత కనీసం మూడేళ్ల బోధన, పరిశోధన లేదా వృత్తిపరమైన ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థికి అవసరమైన పోస్ట్-డాక్టరేట్ ఎక్స్ పీరియన్స్ లేకపోయినా ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఐడీసీ స్కూల్ ఆఫ్ డిజైన్, దేశాయ్ సేథి స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, శైలేష్ J మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ వంటి బ్రాంచ్ స్కూల్స్ కోసం కూడా ఐఐటీ బాంబే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

3 comments:

Job Alerts and Study Materials