నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టాఫీస్ ఉద్యోగలంటే యూత్ లో ఆ క్రేజే వేరుగా ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పోస్టల్ శాఖ సైతం ఎప్పటికప్పుడు వివిధ సర్కిల్స్ లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా నిరుద్యోగులకు పోస్టల్ శాఖ (Postal Jobs) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 58 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అయితే.. ఈ ఉద్యోగాలను తమిళనాడు సర్కిల్ లో భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సూచించిన చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
Anna form send cheyadi form ledu kada
ReplyDelete