Mother Tongue

Read it Mother Tongue

Monday, 20 March 2023

అలర్ట్.. నేడు టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి మరో నోటిఫికేషన్..

 తెలంగాణలో(Telangana) 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. వీటిలో గ్రూప్ 1, 2, 3, గ్రూప్-4 తో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వంటి అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అయితే తాజగా పేపర్ లీకేజీ పరిణామాలతో మళ్లీ మొదటికి వచ్చింది. ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి కాకుండానే.. కొలువుల హంగామా తొలి దశకు చేరింది. 2022 డిసెంబర్ 21న హార్టికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసిన టీఎస్పీస్సీ.. పేపర్ లీకేజీ కారణంగా మార్చి 15, 16లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా రద్దు చేశారు. వీటితో పాటే.. అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ 1, ఏఈఈ, ఏఈ, డీఏఓ వంటి పరీక్షలను రద్దు చేశారు. వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే క్లారిటీ మాత్రం టీఎస్పీఎస్సీ ఇవ్వలేదు. దీనిలో గ్రూప్ 1 మాత్రం జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందిన 64వేలకు పైగా ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లను విడుదల చేయగా.. వాటిలో డిగ్రీ కాలేజ్ లెక్షరర్స్ ఉద్యోగాలకు ప్రకటన విడుదలైనా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు.  డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్లలోనే ఫిజికల్ డైరెక్టర్, పీడీ పోస్టులు కూడా ఉన్నాయి. మొదట పూర్తి నోటిఫికేషన్ జనవరి 31, 2023 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించినా.. తర్వాత దీనిని ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. తర్వాత దీనిని అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో మళ్లీ మార్చి 20 న నోటిఫికేషన్ ను విడుదల చేసి.. దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. కానీ.. టీఎస్పీఎస్సీ నుంచి పలు పేపర్లు లీక్ అవ్వడం.. పరీక్షలు రద్దు అవ్వడం లాంటి గందరగోళ పరిస్థితిలో నేడు (మార్చి 20) టీఎస్పీఎస్సీ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్షరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుందా అంటే.. ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్(NET) లేదా సెట్(SET) లో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు సార్లు నెట్ పరీక్షను(NET Exam) నిర్వహిస్తారు. ఇప్పటికే నెట్ పరీక్ష, సెట్ పరీక్ష కూడా పూర్తయింది. వీటి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీనిలో అర్హత సాధించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు విడుదల అయిన తర్వాత ఈ డీఎల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials