Mother Tongue

Read it Mother Tongue

Friday, 10 March 2023

తెలంగాణలో కొలువుల జాతర.. మరో 11 వేల ఖాళీలకు ఈ నెలలోనే నోటిఫికేషన్.. లేటెస్ట్ అప్టేట్స్ ఇవే

తెలంగాణలో మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలలోనే 11 వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్టేట్స్ ఇలా ఉన్నాయి.

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్యశాఖ నుంచి భారీగా ఉద్యోగాలు విడుదలయ్యాయి. అయితే.. గురుకుల, టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రం ఇంకా విడుదల కాలేదు. దీంతో ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. వివిధ సాంకేతిక కారణాలతోనే ఆ నోటిఫికేషన్లు విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. పలు ఖాళీల భర్తీకి అనుమతుల రాకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఈ నెల మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నియామక బోర్డు కీలక తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో టీచింగ్ జాబ్స్ భర్తీకి ఈ నెల చివరిలోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. ఇప్పటికే అనుమతులు లభించిన 11,012 పోస్టులకు ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేయాలని యోచిస్తోంది. తర్వాత అదనంగా మంజూరయ్యే పోస్టులకు రాత పరీక్ష నాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నియామక బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారీగా ఉద్యోగాలు ఉండడంతో నోటిఫికేషన్ కు సంబంధించి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు.. స్థానికత, ఇతర సాంకేతిక అంశాలతో ట్రయల్ రన్స్ ను బోర్డ్ నిర్వహిస్తోంది. ఇంకా లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉండడంతో సర్వర్ సమస్యలు రాకుండా.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గురుకులబోర్డుకు ఆయా గురుకుల సొసైటీలు అందించాయి. దీంతో గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తును ముమ్మరం చేసింది. నోటిఫికేషన్ల విడుదల తర్వాత సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి రాత పరీక్షకు మధ్య 4 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంది. సమ్మర్ హాలీడేస్ అనంతరం స్కూళ్లు తిరిగి ప్రారంభం నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి సిబ్బంది కొరత సమస్యను తీర్చాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials