Mother Tongue

Read it Mother Tongue

Friday, 10 March 2023

భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. BEL యొక్క ఘజియాబాద్ యూనిట్ కోసం ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bel-india.in లో అప్లై చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 12 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు, 26 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్ననారు. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు జనవరి 1, 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు.. ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ:

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials