ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోనే అది పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో రిటైర్డ్ బ్యాంకింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ నేడు (మార్చి 10) ప్రారభం అయ్యాయి. అయితే దరఖాస్తుకు చివరి తేదీ 31 మార్చి 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించాలి.
వయోపరిమితి.. .
ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల యొక్క కనీస వయస్సు 60 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 10 మార్చి 2023 నాటికి 63 సంవత్సరాలు ఉండాలి.
అర్హతలు
దరఖాస్తుదారు బ్యాంకు రిటైర్డ్ అధికారి కాబట్టి ప్రత్యేక విద్యార్హత అవసరం లేదు. తగిన పని అనుభవం, సిస్టమ్‌లు మరియు విధానాలపై లోతైన పరిజ్ఞానం మరియు సంబంధిత రంగంలో మొత్తం వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న మాజీ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ఇలా..
- ముందుగా అభ్యర్థులు sbi.co.in/web/careers పేజీని సందర్శించండి .
-ఇక్కడ “కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ నియామకం” కింద దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
-దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోండి.
-వివరాలను పూరించి.. రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
-భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోండి.
నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.
No comments:
Post a Comment