Mother Tongue

Read it Mother Tongue

Monday, 13 March 2023

రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.1,40,000 పైగా వేతనం

 భారతీయ రైల్వే న్యూ ఢిల్లీలోని రైల్వే బోర్డులో (Railway Board) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. ఎంపికైనవారికి రూ.1,40,000 పైగా వేతనం లభిస్తుంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మాత్రమే కాదు, రైల్వే కూడా పలు నోటిఫికేషన్స్ జారీ చేస్తూ ఉంటుంది. రైల్వేలో పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్టులు. డిప్యూటేషన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. మొదట మూడేళ్ల కాలానికి వీరిని నియమిస్తారు. ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్టులు. డిప్యూటేషన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. మొదట మూడేళ్ల కాలానికి వీరిని నియమిస్తారు. ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉంది. విద్యార్హతల వివరాలు చూస్తే కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదాబీటెక్ పాస్ కావాలి. ఇతర అర్హతలు చూస్తే కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు, సెమీ గవర్నమెంట్, స్టాట్యుటరీ, అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Deputy Secretary, Room No. 110-C Rail Bhawan Raisina Road, New Delhi- 110001. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ లభిస్తుంది. ఎంపికైనవారికి రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. న్యూ ఢిల్లీలో భారతీయ రైల్వేకు చెందిన రైల్వే బోర్డులో ఈ పోస్టులు ఉన్నాయి. 2023 మార్చి 2న నోటిఫికేషన్ విడుదలైంది. 60 రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ చివరి నాటికి దరఖాస్తుల్ని పంపాలి. అప్లికేషన్ ఫామ్ https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials