Mother Tongue

Read it Mother Tongue

Monday, 13 March 2023

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 5,369 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌! అర్హ‌త‌లు ఇవే..

 స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) 5,369 ఉద్యోగాల‌కు భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు మార్చి 6 నుంచే ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది. ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, అకౌటెంట్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహా మొత్తం 5వేలకు పైగా ఉద్యోగాలున్నాయి. అర్హతలు ఇవే - పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయోపరిమితి- అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం- స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్‌ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్టేటర్, నావిగేషనల్ అసిస్టెంట్. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మార్చి 28 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేయాలి. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని విభాగాలూ చదువుకుంటూ ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు.. ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి...మొదలైనవి తెలుసుకోవచ్చు. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి కనీసం రోజుకి ఒకటైనా మాక్‌ ఎగ్జామ్‌ రాయాలి. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు- తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌. ఏపీలో.. కర్నూలు, , , చీరాల, , , కాకినాడ, , రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials