Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 21 March 2023

తెలంగాణలో మరో 1540 ఉద్యోగాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..

     తెలంగాణలో కొత్తగా మరో 1540 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1540 ఆశా వర్కర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 243, హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్ జిల్లాలో 974 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మరియు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇటీవల తెలంగాణలో ఆశా వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ ఖాళీలకు అనుమతి ఇచ్చారు. త్వరలోనే వీటికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటికి మహిళలు మాత్రమే అర్హులు. ఆశా వర్కర్ ఉద్యోగాలకు 7వ తరగతి లేదా పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆశావర్కర్లకు వేతనం రూ.10వేలు చెల్లిస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన లక్ష్యంగా ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేయడం.. చిన్న పిల్లలకు టీకాలు, బీపీ, షుగర్, ఇతర రోగాలకు మందుల పంపిణీతో పాటు.. కరోనా సమయంలోనూ వ్యాక్సినేషన్ కేసుల తగ్గింపు, రోగుల పర్యవేక్షణ ఇతర సేవలను విజయవంతంగా అందించారు. గృహిణులు , మహిళా నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials