ఉన్నత చదువుల (Higher Education) కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల్లో ఎక్కువమంది ఆయా దేశాల్లోనే స్థిరపడుతున్నారు. దీంతో పాటు ఆకర్షణీయమైన జీతాల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతంలో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు ఎక్కువగా వెళ్లేవారు. ఇప్పుడు వీటి సరసన కెనాడా కూడా చేరింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం చేపట్టే కొన్ని నియామకాలకు భారతీయులు కూడా అర్హులు అని ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (IRCC) డిపార్ట్మెంట్కు సంబంధించిన ఫారిన్ సర్వీస్ విభాగంతో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
తాజా గణాంకాల ప్రకారం కెనాడాలో హెల్త్‌కేర్, సోషల్ అసిస్టెన్స్, ఫుడ్ సెక్టార్, రిటైల్ సెక్టార్, ఫైనాన్స్ అండ్ ఇన్యూరెన్స్ రంగాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం కెనడా ప్రభుత్వం తమ ఫారెన్ సర్వీస్ డివిజన్లో నియామకాలు చేపడుతోంది. రిక్రూట్మెంట్ మొత్తాన్ని IRCC పర్యవేక్షిస్తుంది. ఈ ఉద్యోగాలకు భారతీయులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు జీతం రూ. 43 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు ఉంటుంది. వీటికి భారత్‌తో సహా వివిధ దేశాలకు చెందిన వారు సైతం అప్లై చేసుకోవచ్చు.
అర్హత ఏంటంటే
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీష్, ఫ్రెంచ్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉండాలి. లేదంటే వారు అందులో తగిన శిక్షణ పొందాల్సి ఉంటుంది. జడ్జిమెంట్, అనలిటకల్ థింకింగ్, స్వీయ అవగాహన, క్రాస్-కల్చరల్ సెన్సిటివిటీ, అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఎథిక్స్, సమర్థమైన కమ్యునికేషన్ స్కిల్స్ ఉండాలి. విదేశాల్లో పనిచేసిన లేదా చదువుకున్న అనుభవం, విదేశీ భాషల్లో ప్రావీణ్యం, రిపోర్ట్ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్, సోషల్ మీడియా వినియోగం, డేటా అనాలిసిస్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది.
ఉద్యోగ బాధ్యతలు
ఉద్యోగ బాధ్యతల్లో మైగ్రేషన్, దౌత్య సంబంధ కార్యకలాపాలతో పాటు రిస్క్ అసెస్మెంట్, అప్లికేషన్ ప్రాసెసింగ్, ఎంగేజ్మెంట్ తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇండియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, టర్కీ, సెనెగల్, చైనా తదితర దేశాల్లో పోస్టింగ్ ఉంటుంది. అయితే ఈ పొజిషన్ రొటేషన్ విధానంలో ఉంటుంది. ఉద్యోగులు ప్రతి 2 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి డిపార్ట్మెంట్ నిర్ణయాల ప్రకారం తమ విధులు మార్చుకోవాల్సి ఉంటుంది.
కెనడా వెబ్సైట్లో దరఖాస్తులు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు కెనడా ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి వివరాలు చూడచ్చు. ఆ వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా స్థానాలు భర్తీ పూర్తయ్యే వరకు ఐఆర్సీసీ నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది. సెలక్ట్ అయినవారు అంతర్జాతీయంగా కెనడా దేశ ప్రయోజనాలు లక్ష్యంగా బాధ్యతలు నిర్వహించాలి.
BODA BHADRAJI
ReplyDeletesir b.tech second year chaduvutundhi maa sister e job ki aligibul avu tuntun da s
ReplyDeleteAge limit ledha sir?
ReplyDelete